భూపాలపల్లి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోట చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన పూజారి పవన్ (23), సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన చింతల సాయికిరణ్ లు మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా భూపాలపల్లి జిల్లా రేగొండ శివారుకు రాగానే అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మొన్న రష్మిక ..నేడు కాజల్ కాజోల్ డీఫేక్ వీడియోలు రెచ్చిపోతున్న కేటుగాళ్లు
బొగ్గుగని కంపెనీ ఆఫీస్‌లో ఎగిసిపడ్డ మంటలు 6గురు మృతి 38 మందికి గాయాలు