తెల్లవారితే ఎన్నికల ఫలితాలు… కొద్ది గంటలే సమయం ఉంది. తెలంగాణ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ నరాల తెగే ఉత్కంఠ ఉంది. ఏ పార్టీ అధికారం వస్తుంది అనేదే పెద్ద చర్చ. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ లీడర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. బీఆర్ ఎస్ కూడా అదే స్థాయిలో ఫుల్ జోష్ లో ఉంది. సోమవారం కేబినెట్ భేటి, ప్రగతి భవన్‌కు పెయింట్ వేయడం లాంటివి తెలంగాణ సమాజంలో చర్చకు తెరలేసింది. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గెట్ రెడీ టూ సెలబ్రెట్ గాయిస్ హ్యాట్రిక్ 3.0 అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి గన్ ఎయిమ్ చేసిన ఫొటోను ట్యాగ్ చేశారు. ఈ ఫొటో బీఆర్ ఎస్ వర్గాల్లో జోష్ నిండింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండు పార్టీల మధ్య అధికారం ఎవరిదీ అనే ఉత్కంఠ నెలకొంది.
Hattrick Loading 3.0 👍
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
— KTR (@KTRBRS) December 2, 2023
ఇవి కూడా చదవండి
కేసీఆర్ కు సూట్ కేస్ గిఫ్ట్.. వైఎస్ షర్మిల