సోషల్ విూడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోన్న భామల్లో టాప్‌లో ఉంటుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక కొన్ని రోజులుగా నెట్టింట డిఫరెంట్ గెటప్స్‌లో కనువిందు చేస్తుందని తెలిసిందే. దీనిక్కారణమేంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన యానిమల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది రష్మిక మందన్నా. రష్మిక మందన్నా, విజరు దేవరకొండ క్రేజీ కాంబో గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో హిట్ పెయిర్‌గా నిలిచిన ఈ ఇద్దరు.. ఆఫ్ స్కీన్ర్‌లో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజరు దేవరకొండ ఫ్యామిలీతో కూడా సూపర్ బాండింగ్ కొనసాగిస్తుంది రష్మిక. కాగా ఎప్పటికప్పుడు నెటిజన్లు, మూవీ లవర్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటారు రష్మికా-విజరు దేవరకొండ. విజరు దేవరకొండ హోం బ్రాండ్ రౌడీ వేర్ (ఖీనీలిటా లి|జీస)కు మార్కెట్‌లో ఏ రేంజ్‌లో పాపులారిటీ ఉంటుందో తెలిసిందే. ఇప్పుడిదే రౌడీ వేర్‌లో కనిపించి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది రష్మిక .స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న రష్మిక మందన్నా రౌడీ వేర్ బ్రాండ్ హుడీ వేసుకొని.. ఎయిర్‌పోర్టులో నుంచి వస్తున్న విజువల్స్ హల్ చల్ చేస్తున్నాయి. రష్మిక మందన్నా.. ఏంటీ సంగతి అంటూ తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. రణ్‌బీర్‌కపూర్ అవార్డు విన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. ఇక తన పాత్రకు పోసే రష్మిక మందన్నా ఎప్పటిలాగే గీతాంజలి సింగ్ పాత్రలో జీవించేసిందని అంటున్నారు సినీ జనాలు. రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో నటిస్తోంది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ కథాంశంతో సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాకు రెయిన్ బో టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు.
Check Also
Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో
Jaipur” మంటల్లో కాలుతున్న కారు రోడ్డుపై దూసుకెళ్లింది. ముందుకెళ్తున్న క్రమంలో డివైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని …
Warangal” డెకరేషన్ లైట్లకు తగిలి వ్యక్తి మృతి.. చేతిలో మనవడు… వీడియో
Warangal” బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. షోకేజ్ కోసం ఏర్పాటు చేసిన లైట్లకు తగిలి వ్యక్తి మృతి చెందాడు. …