తెల్లవారితే ఫలితాలు.. ఇప్పటికే కాంగ్రెస్ తమదే అధికారమని ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణాలోనే ఉంది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. మరో వైపు బీఆర్ఎస్ కూడా తమదే అధికారమని క్యాడర్ కు జోష్ నింపుతోంది. మూడో సారి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఘంటా పథంగా చెబుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వెడెక్కిపోతోంది. కాంగ్రెస్ కు మద్దతుగా వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ ఉండంతో హస్తం పార్టీ అధికారంలో కి వస్తుందిని షర్మిల కూడా గట్టిగా నమ్ముతోంది. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వైరైటీ గిఫ్ట్ పంపారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్ కు సూట్ కేసు బహుమతిగా పంపారు. బైబై కేసీఆర్..కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్ధుకునే టైం వచ్చింది. కేసీఆర్ గారు ప్యాక్ అప్ చేసుకోండి. బైబై కేసీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని… ఆయనకు ఒక గిప్ట్ ఇస్తున్నట్టు చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి.. తాము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని.. కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం మారాలని.. ఎవరు ముఖ్యమంత్రికావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని వైఎస్ షర్మిలారెడ్డి చెప్పుకొచ్చారు.
2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కొనుగోలు చేసిన నాయకులు అక్షరాల 45 మంది. అందులో ఎమ్మెల్యేలు 40, ఎమ్మెల్సీలు 4, ఒక ఎంపీ ఉన్నారు. పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా ప్రజల తీర్పును శిరసావహించాలి. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజలకు అర్థమవుతోంది. కేసీఆర్ ఎంత… pic.twitter.com/kpOoI85yZs
— YS Sharmila (@realyssharmila) December 2, 2023
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది. తెలంగాణ ప్రజలు ‘బై బై కేసీఆర్’ అని చెబుతున్నారు అందుకే ఓ సూట్ కేసును కేసీఆర్ కు బహుమతిగా ఇస్తున్నాం. ఎన్నికల్లో మేము పోటీ… pic.twitter.com/mxAzYAFSjg
— YS Sharmila (@realyssharmila) December 2, 2023
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. కేసీఆర్ అవినీతి గురించి పూర్తిగా తెలిసినా కేంద్రంలోని బీజేపీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కేసీఆర్ పెద్ద అవినీతిపరుడని మోదీ, అమిత్ షా లు సభల్లో చెపుతుంటారని… అలాంటప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదో… pic.twitter.com/jyzfnA2lMm
— YS Sharmila (@realyssharmila) December 2, 2023
2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కొనుగోలు చేసిన నాయకులు అక్షరాల 45 మంది. అందులో ఎమ్మెల్యేలు 40, ఎమ్మెల్సీలు 4, ఒక ఎంపీ ఉన్నారు. పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా ప్రజల తీర్పును శిరసావహించాలి. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజలకు అర్థమవుతోంది. కేసీఆర్ ఎంత… pic.twitter.com/kpOoI85yZs
— YS Sharmila (@realyssharmila) December 2, 2023
ది గ్రేట్ వాల్ ఆఫ్ పల్నాడు.. రోడ్డు మధ్యలో గోడ..