పల్లెటూర్లలో చుట్టు పక్కల ఇండ్లల్లో ఉండే వారి మధ్య సాధారణంగా గొడవలు జరుగుతుంటాయి. ఒక్కో సారి అవి తీవ్ర రూపం దాల్చుతాయి. అటువంటి గొడవే ఒక్కడ ఒక్కటి ఇక్కడి చోటు చేసుకుంది. పల్నాడు – శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ ఇళ్లు ఎదురెదురుగా ఉన్నాయి. వీరి మధ్య చాలాసార్లు విభేదాలు తలెత్తగా ఊరి పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది. ఇటీవల ఈ గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ ఏకంగా ఇంటి ముందున్న రోడ్డు మధ్యలో గోడ నిర్మించారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ పల్నాడు అని ఒకరు. ఏంట్రా బాబు ఇలా ఉన్నారు మీరు అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. Telugu Scribe వారు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఎదురింటి వారితో గొడవల కారణంగా రోడ్డు మధ్యలో గోడ కట్టిన ఓ ఇంటి యజమాని
పల్నాడు – శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ ఇళ్లు ఎదురెదురుగా ఉన్నాయి. వీరి మధ్య చాలాసార్లు విభేదాలు తలెత్తగా ఊరి పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది. ఇటీవల ఈ… pic.twitter.com/Gv76SzNW2C
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2023