ఇండియాలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటేనే క్రికెట్ అభిమానుల సంతోషం పట్టలేనంతగా ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే 2024 ఐపీఎల్‌కు అన్ని ఫ్రాంచైజీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ వేలాన్ని మంగళవారం దుబారు వేదికగా అక్కడి సమయం 11.30 నిమిషాలు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు) నిర్వహించనున్నారు. 10 ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొననున్నాయి. తమ ఫేవరెట్ ప్లేయర్లు ఏ టీమ్‌కు ఆడతారనే ఆతృత అభిమానుల్లో తలెత్తుతోంది.
1166 మంది ప్లేయర్ల రిజిస్ట్రేషన్..
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడేందుకు 1166 మంది ప్లేయర్లు రిజిష్టర్ చేసుకున్నారు. అయితే 333 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్‌ను బీసీసీఐ తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 214 మంది భారతీయ ప్లేయర్లు ఉండగా మిగతా 119 మంది విజేశీ ప్లేయర్లకు చోటు దక్కనుంది. 10 జట్లకు గానూ 77 మంది ప్లేయర్ల స్థానాలు భర్తీ కావాల్సి ఉండగా 30 మంది విదేశీ ఆటగాళ్లను నియమించుకున్నారు.
రోహిత్ వైపే అందరి చూపు…
ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు కప్‌ను అందించిన రోహిత్‌శర్మను కెప్టెన్ బాధ్యతల నుంచి తొలగించడం పట్ల ప్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి క్రికెట్ మాజీ దిగ్గజాలు మాత్రం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇందుకు గల కారణాలనూ వెల్లడిస్తున్నారు. రోహిత్ ఆటలో వేగం తగ్గిందని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించడం సరైన నిర్ణయం అని చెప్తున్నారు. 2022లో వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు మొదటి ప్రయత్నంలోనే కప్‌ను అందించాడని, రెండోసారి రన్నరప్‌గా నిలిపాడని విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి రోహిత్‌ను సన్‌రైజర్స్, డీసీ, మిగతా ఫ్రాంచైజీలు దక్కించుకుంటాయో లేదో.
అప్పులు ఉన్నాయంటూ ఆలస్యం… తెలంగాణాలోనూ భవిష్యత్ ఇదేనా…? కేటీఆర్ ట్వీట్ ..
అధిక రేటు పలికిన ఆటగాళ్లు..
ఈ ఐపీఎల్‌లో అధిక ధర పలికిన ఆటగాళ్లను చూస్తే..ఐపీఎల్ మాక్ వేలంలో మిచెల్ స్టార్క్ రూ. 18.5 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ప్యాట్ కమ్మిన్స్‌ను రూ. 17.5 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్, శార్దూల్‌ను రూ. 14కోట్లతో పంజాబ్, హ్యారీ బ్రూక్ రూ. 9.5 కోట్లతో గుజరాత్ టైటాన్స్, వనిందు హసరంగ రూ. రూ. 8.5 కోట్లతో చెన్నై కొనుగోలు చేసింది. ఈ కొనుగోలును బ్యాట్స్‌మెన్, ఫాస్ట్‌బౌలర్, స్పిన్నర్, వికెట్ కీపర్, ఆల్‌రౌండర్, క్యాప్డ్, అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా వేలంలో తీసుకుంటారు. కాగా బెన్‌స్టోక్స్, జోరూట్, జోఫ్రా ఆర్చర్, కేదార్ జాదవ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హాసన్ ఈ ఐపీఎల్‌కు దూరం కానున్నట్టు తెలుస్తోంది.
వేలాన్ని నిర్వహించేది మల్లికా సాగర్…
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా వేలాన్ని నిర్వహించనున్న తొల మహిళగా మల్లికా సాగర్ చరిత్ర సృష్టించనుంది. అయితే ఈవె డబ్ల్యూపీఎల్‌కు పాటదారుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఎవరెవరు పనిచేసారో చూసుకుంటే.. 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మ్యాన్లీ ఆప్షనీర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2018 నుంచి హ్యూ ఎడ్మిడ్స్ ఈ బాధ్యతలను నిర్వర్తించారు. 2022లో మెగా వేలంలో అనారోగ్యం కారణంగా ఆయన వైదొలిగాడు. అప్పుడు చారు శర్మ ఆ వేలాన్ని కొనసాగించాడు. వేలాన్ని నిర్వహించిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కిరు చారు శర్మ.
Auction Briefing ✅
The 🔟 teams are set for tomorrow!
Are YOU ready for #IPLAuction ❓ pic.twitter.com/uCDuC30Kzn
— IndianPremierLeague (@IPL) December 18, 2023
అప్పులు ఉన్నాయంటూ ఆలస్యం… తెలంగాణాలోనూ భవిష్యత్ ఇదేనా…? కేటీఆర్ ట్వీట్ ..
లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి రాయించుకొని.. కుటుంబాన్నిచంపిన దుర్మార్గుడు..
రోహిత్, హార్థిక్ .. మధ్యలో అంబానీ బుజ్జగింపులు.. ఫ్యాన్స్ ట్రోల్స్… వీడియో వైరల్