మాల్దీవుల దేశానికి చెందిన ముగ్గురు మంత్రులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మాల్దీవులకు చెందిన మంత్రుల భారతీయు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ చర్యకు పూనకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోని లక్షదీప్ దీవులను సందర్శించారు. అక్కడి బీచ్‌లలో సరదగా గడిపారు. సాహసాలు చేయడానికి లక్షదీప్ దీవులు రెడీ గా ఉన్నాయంటూ పిలుపునిచ్చారు. ఇటీవలే లక్షద్వీప్ ప్రజల మధ్య ఉండే అవకాశం వచ్చిందని, దాని ద్వీపాల యొక్క అద్భుతమైన అందం మరియు దాని ప్రజల అద్భుతమైన వెచ్చదనానికి నేను ఇప్పటికీ విస్మయం చెందాను. అగట్టి, బంగారం, కవరత్తిలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం నాకు లభించింది. నేను ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పీఎం మోడీ పోస్టు చేశారు.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
ఇక్కడి వరకు బాగానే ఉన్నా దీనిపై మాల్దీవుల ప్రజాప్రతినిధులు మాటలతో మంటలు రాజేశారు. భారతదేశ టూరిజంపై అక్కసు వెళ్లగక్కారు. ముగ్గురు మంత్రులు సోషల్ మీడియా వేదికగా మనదేశాన్ని ఆడిపోసుకున్నారు. అక్కడ గదులు సరిగా ఉండవని, విపరీతమైన దుర్వాసన వస్తుంటదని, టూరిజంలో మాల్దీవులతో పోటీ పడడటం ఓ భ్రమేనంటూ తీవ్రంగా భారత్‌ను దూషించారు. మేము అందించే సర్వీస్ ను వారు ఎప్పుడు అందించలేరు.? అక్కడ శుభ్రత ఉండదు.? గదుల్లో దుర్వాసన వస్తుంటుంది’’ అని అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల (పీపీఎం) కౌన్సిల్ సభ్యుడు జాహిద్ రమీజ్ ‘ఎక్స్’ లో రాశారు.
ఈ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు, కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. భారత నెటిజన్లు కూడా మాల్దీవుల చర్యను తీవ్రంగా పరగణించారు. ఇప్పటికే చాలా మంది మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 8 వేల హోటల్స్ బుకింగ్స్, 2500 విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. మాల్దీవులకు స్థానంలో లక్షద్వీపాన్ని పర్యటించాలని అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్ లాంటి పలువురు సెలబ్రెటీలు సూచించారు.
ఈ పరిణామాలన్నింటిపై మాల్దీవుల ప్రభుత్వం స్పందించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ దేశ ప్రధానమంత్రి అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు విదేశ పర్యటనలో ఉన్నప్పటికీ వీరిపై చర్యలకు ఆదేశించారు.
In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti) January 7, 2024
ప్రపంచంలోనే మొదటి ట్రైన్ పబ్.. వీడియో వైరల్