ఆర్టీసీ లో ఉచిత ప్ర‌యాణానికి ఇది త‌ప్ప‌నిస‌రి… లేకుంటే 500 ఫైన్‌.. ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రెండు కీల‌క ప‌థ‌కాల‌ను అమలు చేయ‌డం ప్రారంభించింది. అందులో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. ఈ ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమ‌లు అవుతోంది. దీనిపై ఆర్టీసీ యాజ‌మాన్యం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం” వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసర‌ని స్ప‌ష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాల‌ని పేర్కొంది.

ముగ్గురు మంత్రుల సస్పెన్ష‌న్.. భార‌త్‌లో సంబ‌రాలు.. అస‌లేం జ‌రిగింది…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని తెలిపారు. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని సూచించారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారని #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింద‌ని పేర్కొన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంద‌ని వివ‌రించారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంద‌ని పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

సంక్రాంతి బరి నుంచి ఈగిల్‌ ఔట్‌ : కార‌ణం ఇదే

ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాల‌ని కోరారు. జీరో టికెట్ తీసుకుని ప్ర‌యాణం చేయాల‌ని చెప్పారు. ప్రతి మహిళా జీరో టికెట్‌ను తీసుకోవాల‌ని ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరారు. ఈ మేర‌కు ఆర్టీసీ ఎండీ ట్విట‌ర్‌లో ప్ర‌క‌టన చేశారు.

 

ప్ర‌పంచంలోనే మొద‌టి ట్రైన్ ప‌బ్‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *