తెలంగాణ రాష్ట్రాన్ని షార్ట్‌కట్‌లో టీఎస్ అని రాస్తున్నాం. అయితే దీనిని టీజీగా మార్చనున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేడు జరగే కేబినేట్ భేటిలో నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకుంటున్నారు. రాష్ట్రాల పేర్లను కొన్ని సందర్భాలలో షార్ట్‌కట్‌లో వాడుతుంటారు. ముఖ్యంగా వాహనాల నెంబర్ ప్లేట్లపై రాస్తుంటారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ అని ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది టీజీ అని తమ వాహనాలపై రాసుకొని నిరసన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణాను టీజీ గా పిలుస్తారని అందరూ భావించారు. అప్పటి ప్రభుత్వం అనూహ్యంగా టీఎస్ అని నామకరణం చేసింది. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని వివరణ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ టీఎస్ స్థానంలో టీజీగా రాయాలనే నిర్ణయాన్ని తీసుకుంటుందనే చర్చ జోరుగా చర్చ నడుస్తోంది. టీజీ అంటే తెలంగాణ అని పలికేలా మార్చనున్నారని సమాచారం. . ఇలా మారాలంటే నేటి కేబినేట్ భేటిలో నిర్ణయం తీసుకోవాలి. తరువాత జీవో విడుదల చేయాల్సి ఉంటుంది.
మారేవి ఇవే…
వాహనాల నెంబర్లు టీఎస్ స్థానంలో టీజీ గా రిజిస్ట్రేషన్ అవుతాయి.. దీంతో పాటు టీఎస్‌పీఎస్సీగా ఉన్న రిక్రూట్ మెంట్ బోర్డు టీజీపీఎస్సీగా మారుతాయి. టీఎస్ ఆర్టీసీ పేరు టీజీ ఆర్టీసీ గా మారిపోనుంది. ఇలా అన్నింటి పేరులో టీఎస్ స్థానంలో టీజీగా మారుతాయి..
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …