Tuesday , 7 January 2025
Breaking News
Tdp Mla Candidates

Tdp Mla Candidates” టిడిపి రెండో జాబితా విడుదల

34 మందితో జాబితా విడుదల చేసిన పార్టీ 
Tdp Mla Candidates” పొత్తులు కుదరడంతో ఇప్పటికే తొలిజాబితా ప్రకటించిన టిడిపి తన రెండో జాబితాను గురువారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న (Tdp Mla Candidates) టీడీపీ ఇప్పటికే తొలి విడతలో భాగంగా 94 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. తాజాగా రెండో విడత అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. రెండో విడతలో భాగంగా 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 128 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేడో, రేపో విడుదల కావడానికి ముందు (Tdp Mla Candidates)  తెలుగుదేశం పార్టీ రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించింది. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 11 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 9 మంది గ్రాడ్యుయేషన్‌ చేసినవారు ఉన్నారు. ఒకరు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థి ఉన్నారు. కాగా 8 మంది ఇంటర్మీడియెట్‌, ఐదుగురు 10వ తరగతి విద్యార్హతగా కలిగినవారు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 27 మంది పరుషులు, ఏడుగురు స్త్రీలు ఉన్నారు. ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే 25-35 ఏళ్ల మధ్య వయసువారు ఇద్దరు, 36-45 ఏళ్లలోపువారు 8 మంది, 46-60 ఏళ్ల వయసున్నవారు 19 మంది, 61-75 ఏళ్లవారు ముగ్గురు, 75 ఏళ్లకుపైబడినవారు ఇద్దరు ఉన్నారు.

తాజా జిబితా
1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు
2. రంప చోడవరం – మిర్యాల శిరీష
3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు
4. ప్రత్తిపాడు-వరుపుల సత్యప్రభ
5. దెందులూరు-చింతమనేని ప్రభాకర్‌
6. గుంటూరు ఈస్ట్‌-మహ్మద్‌ నజీర్‌
7. గుంటూర్‌ వెస్ట్‌- పిడుగురాళ్ల మాధవి
8. గిద్దలూర్‌-అశోక్‌ రెడ్డి
9. పెద్దకూరపాడు-భాష్యం ప్రవీణ్‌
10. రాజమండ్రి రూరల్‌-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి
11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి
12. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు
13. కోవూరు(నెల్లూరు జిల్లా)- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
14. కొవ్వూరు(రాజమండ్రి)-ముప్పిడి వెంకటేశ్వరరావు
15. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు
16. ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి
17. నందికొట్కూర్‌- గిత్తా జయసూర్య
18. కదిరి-కందికుంట యశోదా దేవి
19. మాడుగుల-రెలా ప్రసాద్‌
20. కందుకూర్‌ – ఇంటూరి నాగేశ్వరరావు
21. మదనపల్లి-షాజహాన్‌ భాషా
22. రామచంద్రపురం- వాసంశెట్టి సుభాష్‌
23. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
24. వెంకటగిరి- కురుగొండ్ల లకిëప్రియ
25. కమలాపురం- పుత్తా చైతన్య రెడ్డి
26. ప్రొద్దుటూరు-వరదరాజుల రెడ్డి
27. ఎమ్మిగనూరు-జయనాగేశ్వర రెడ్డి
28. మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
29. పుట్టపర్తి-పల్లె సింధూరా రెడ్డి
30. పుంగనూరు-చల్లా రామ చంద్రారెడ్డి(బాబు)
31. చంద్రగిరి- పులివర్తి వెంకట మణిప్రసాద్‌(నాని)
32. శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి
33. సత్యవేడు-కోనేటి ఆదిమూలం
34. పూతలపట్టు- డాక్టర్‌ కలికిరి మురళి మోహన్

 

 

About Dc Telugu

Check Also

07.01.2025 D.C Telugu Cinema

Earbuds

Earbuds” ఐటెల్ బడ్స్ ఏస్ 2 TWS ఇయర్‌బడ్స్.. జ‌స్ట్ 1199ల‌కే..

Earbuds”  ఐటెల్ బడ్స్ ఏస్ 2 TWS ఇయర్‌బడ్స్ – క్వాడ్ మైక్ ENC, 13mm బాస్ బూస్ట్ డ్రైవర్లు, …

Different mobile

Different mobile” రౌండ్ స్క్రీన్ స‌ర్కిల్ మొబైల్.. కేవ‌లం రూ. 999ల‌కే..

Different mobile” సాధార‌ణంగా ఫోన్లు దీర్ఘ‌చ‌తురస్రాకారం ఉంటాయి. కానీ ఈ ఫోన్ ఐటెల్ ఫోన్ మాత్రం స‌ర్కిల్ ఆకారం లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com