Rythu Bharosa” రాళ్లు ర‌ప్ప‌ల భూములకు బంద్‌.. భూమిలేనోళ్ల‌కు రూ. 12 వేల సాయం..

Rythu Bharosa

Rythu Bharosa” వ్య‌వ‌సాయాన్ని మ‌రింత లాభ‌సాటిగా మార్చి రైతుల‌కు చేదోడు వాదోడు గా ఉండేందుకు గ‌త ప్ర‌భుత్వం రైతు బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం పై అప్పుడు కొన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వ్య‌వ‌య‌సాయ భూములేకాకుండా భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఇచ్చారు. భూమిలేని పేద‌ల‌కు ఎటువంటి సాయం అంద‌క‌పోవ‌డం.. రాళ్లు, ర‌ప్ప‌లు, ఫ్యాక్ట‌రీలు ఉన్న భూముల‌కు రైతు బంధు ఇవ్వ‌డంతో ఈ ప‌థ‌కంపై ప‌లువురు పెద‌వి విరిచారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని అర్హులైన రైతుల‌కే సాయం అంద‌చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. భూమిలేని పేదల‌కు కూడా సాయం చేస్తామ‌ని చెప్పారు. శ‌నివారం నిర్వ‌హించిన (Cabinet) కేబినేట్‌ స‌మావేశంలో ఈ ప‌థ‌కంపై చ‌ర్చించారు. (Cabinet)  కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వర్గ నిర్ణయాలను (Cm Revanthreddy) సీఎం రేవంత్‌ రెడ్డి విూడియాకు వివరించారు. ఇందిర‌మ్మ రైతు భ‌రోసా ప‌థ‌కం కింద వ్య‌వ‌సాయం చేసే రైతులు ఎక‌రానికి 12 వేల రూపాయ‌లు చెల్లించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. రాళ్లూ, రప్పలు, కొండలు, రోడ్డు కింద పోయిన భూములు, క్రషర్లు నిర్వహిస్తున్న‌ భూములు, ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భ‌రోసా ను నిలిపియేయ‌నున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భ‌రోసా ప‌థ‌కం జ‌న‌వ‌రి 26 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామ‌న్నారు. ప్రతి ఎకరాకు ఏడాదికి 12వేల రూపాయ‌లు ఇవ్వ‌నున్న‌న్నారు. గుట్టలు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వబోమ‌ని (Cm Revanthreddy) సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి  (Indirmma) ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అని నామకరణం చేశారు. ఈ ప‌థ‌కం కూడా జ‌న‌వ‌రి 26 నుంచి అమ‌లుకానుంది.

మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Samsung Galaxy Watch6″ సాంసంగ్ గెలాక్సీ వాచ్ 6.. ₹39,999.. ఇంత ధ‌ర‌కు ఫీచ‌ర్లేంటో తెలుసుకుందామా..?

China Virus News” చైనాలో ఆగ‌మాగం..ఆస్ప‌త్రుల‌కు క్యూ క‌ట్టిన జ‌నం.. సీజ‌న‌ల్ వ్యాధే అంటున్న చైనా

Tamilnadu Pattukottais” రెండు బ‌స్సుల మ‌ధ్య చిక్కుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి.. వీడియో

Tata Group” టాటా గ్రూపులో 5 లక్షల ఉద్యోగాలు, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌

TOSHIBA Smart LED TV” తోషిబా 43 ఇంచుల టీవీ ₹ 24,999లు..

Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాట‌రీ లైఫ్ బోట్ ఇయ‌ర్ బ‌డ్స్ రూ. 1799 ల‌కే…

Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాట‌రీ లైఫ్ బోట్ ఇయ‌ర్ బ‌డ్స్ రూ. 1799 ల‌కే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *