పులి తోక కనపడితేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులంకించుకుంటాం అటువంటింది. చిరుతపులితో పోరాటం అంటే మాటల్లో చెప్పలేం. కొన్ని సినిమాల్లో మాత్రమే చూసుంటాం. కానీ రాజస్థాన్‌లో ఓ జర్నలిస్ట్ చిరుతతో పోరాడాడు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్ – దుంగార్‌పుర్ భదర్ మెట్వాల గ్రామంలోకి చిరుత రావటంతో ఆ చిరుతను జనాలు తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు రాళ్లు రువ్వుతు చిరుతను బెదిరించారు. అయితే అక్కడే ఓ వార్తను కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టు గున్వంత్ కలాల్ పై చిరుత దాడి చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకుంది. అయితే అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకున్నారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది చిరుతపులిని బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగు స్క్రయిబ్ వారు ఎక్స్‌లో పోస్టు చేశారు.
చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్
రాజస్థాన్ – దుంగార్‌పుర్ గ్రామంలోకి చిరుత రావటంతో ఆ చిరుతను జనాలు తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే కవరేజ్‌లో ఉన్న జర్నలిస్టుపై చిరుత దాడి చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకుంది. అయితే అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా… pic.twitter.com/RlYW7EupAE
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024
ఇవి కూడా చదవండి
Kcr Press Meet” చాలా బాధతో మాట్లాడుతున్న. ఇట్లయితదనుకోలే.. : కేసీఆర్
Insect Viral Video” ఇలా బుద్ది చెబితే.. మన జోలికిఎవరురారు.. తొండను కొరికిన కీటకం.. వీడియో వైరల్
Tiger Viral Video” ఏనుగును చూసి దాక్కున్న పులి.. వీడియో వైరల్