పటాన్ చెరులో కొడుకును.. ఆదిలాబాద్‌లో భర్తను
crime news” వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని కన్నవారిని కట్టుకున్న వారిని అంతమొందించారు. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును ఉరి వేసి చంపి ఆత్మహత్యగా చిత్రికరీంచింది ఓ తల్లి. పటాన్‌చెరులో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి జిల్లా లింగం పేట మండలం పోల్కంపేట కు చెందిన కర్రె స్వాతి తన భర్త చనిపోయాడు. ఈమె కొంత కాలంగా (Patan cheru) పటాన్‌చెరులో నివాసముంటోంది. ఈమెకు ప్రకాశం జిల్లాకు సంతనూతల పాడు మండలం చీమకుర్తికి చెందిన దొంతు అనిల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారంపై స్వాతి కుమారుడు విష్ణువర్తన్ (9) ఆమెను నిలదీసేవాడు. ఈ క్రమంలో కొడుకును మెడకు ఉరేసి చంపేసింది. హత్య నుంచి తప్పించుకునేందుకు బాలుడి మృతదేహాన్నిస్కూటిపై తీసుకెళ్లి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడేసి వచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు కేసు మిస్టరినీ చేదించారు. స్వాతి, ఆమె ప్రియుడు అనిల్‌ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
ఆదిలాబాద్‌లో టీచర్‌ను చంపించిన భార్య
(adilabad) ఆదిలాబాద్ లో రెండు రోజుల క్రితం ఉపాధ్యాయుడు జాదవ్ గజానంద్ జైనథ్ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విస్తుపోయే విషయాలు తెలిసాయి.
మృతుడి గజేందర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆయనకు తొమ్మిదేండ్ల క్రితం విజయలక్ష్మితో వివాహమైంది. వీరికి ఏడేండ్ల కొడుకు ఉన్నాడు. వీరు ఆదిలాబాద్‌లో నివాసముంటున్నారు. విజయలక్ష్మికి మహేష్అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయమై భార్యతో గజేందర్ కు గొడవలు జరిగాయి. ఈక్రమంలో గజేందర్ తమ సంబంధాని అడ్డుగా ఉన్నాడని ప్రియడు మహేశ్‌తో కలిసి ప్లాన్ వేసింది. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. గజేందర్ పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో సుఫారీ గ్యాంగ్ మార్గ మధ్యలో బండరాయితో కొట్టి చంపారు. కేసు మిస్టరీని చేధించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇవి కూడా చదవండి
crime news” అడ్డుగా ఉన్నారని అంతం.. ఓ చోట కొడుకును చంపిన తల్లి.. మరో చోట భర్తను చంపిన భార్య
Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు
Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహరణ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైరల్
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..