Tuesday , 23 July 2024

thief” హైటెక్ దొంగ.. విమానాల్లో చోరీలు.. కిలో బంగారం స్వాధీనం..

thief”  దొంగలంటే. ఎక్కువ‌గా ఎవ‌రు లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఓ దొంగ మాత్రం వైరేటీగా ఆలోచించాడు. చోరీలు చేసేందుకు (plane) విమానాలనే అడ్డగా మార్చుకుని దొంగ‌త‌నాలు చేస్తున్నాడు. ఇలా దొంగతనాలకు పాల్ప‌డుతున్న ఓ వ్య‌క్తిని ఎట్టకేలకు శంషాబాద్‌ (Airport) ఎయిర్‌ పోర్ట్‌ పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్య‌క్తినుంచి సుమారు ఒక కిలో గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌ కు పంపించారు. శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి విూడియా సమావేశంలో వివ‌రాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రాజేష్‌ సింగ్‌ కపూర్‌ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి.. చోరీల‌కు పాల్పడుతున్నట్లు చెప్పారు. 110 రోజుల్లో ఏకంగా 200 సార్లు (plane) విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడినట్టు వివ‌రించారు. కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణించి ఒంటరి మహిళలే లక్ష్యంగా ఈ దొంగతలకు పాల్పడుతున్నాడని తెలిపారు. (plane) విమానంలోని క్యాబిన్‌ లో భద్రపరిచిన ఒంటరి మహిళల బ్యాగుల పక్కనే నిందితుడు తన బ్యాగును పెట్టి.. వారు వాష్‌ రూమ్‌ కు వెళ్లిన వెంటనే అక్కడికి వెళ్లి సదరు మహిళల బ్యాగులో ఉండే విలువైన బంగారు ఆభరణాలను అతని బ్యాగులో పెట్టుకోవడం జరుగుతుందని చెప్పారు. తర్వాత విమానం దిగి బంగారు ఆభరణాలను బ్రోకర్లకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడని వివ‌రించారు. ఆర్‌ జీ పోలీస్‌ స్టేషన్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో నిందితుడిపై పది కేసులు నమోదు అయ్యాయన్నారు. అతనికి సహకరిస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. (plane) విమానాల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట తీసుకువెళ్లే బ్యాగులను జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

italian parliament” పార్ల‌మెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు..

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

About Dc Telugu

Check Also

Crime News

Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Crime News” మాజీ సోల్జ‌ర్ త‌న సొంత కుటుంబ స‌భ్యులనే దారుణంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న హ‌ర్యాల‌నాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి …

Delhi - Meerut Expressway

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Delhi – Meerut Expressway”  ఢిల్లీ మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వ‌చ్చిన …

Hyderabad News

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Hyderabad News” రెండు మూడు రోజులుగా వ‌ర్షాలు ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com