UPSC”యూపీఎస్సీ ఖాళీలు 1129.. ప‌రీక్ష కేంద్రాలు.. పూర్తి వివ‌రాలు..

UPSC”979 ఖాళీలకు UPSC CSE ప్రిలిమ్స్ 2025 నోటిఫికేషన్ విడుదలయింది. దరఖాస్తు ప్రక్రియ, అర్హత, పరీక్ష పూర్తివివ‌రాల‌కు మొత్తం ఆర్టిక‌ల్స్‌ను చ‌ద‌వండి..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, UPSC, సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు 2025 కోసం బుధవారం, జనవరి 22, 2025న అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతిష్టాత్మక పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు తమ దరఖాస్తులను upsc.gov.in లేదా upsconline.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2025.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు మరిన్నింటితో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాలలోని వివిధ పోస్టులను భర్తీ చేయడానికి సుమారు 979 ఖాళీలకు నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. వీటితో పాటు ఇండియ‌న ఫారెస్ట్ స‌ర్వీస్‌లో మ‌రో 150 పోస్టులుకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

విద్యా అర్హ‌త

గుర్తింపు పొందిన ఏదైన విద్యాసంస్థ‌ల నుంచి బ్యాచిల‌ర్ డిగ్రీ ఉండాలి. లేదా త‌త్స‌మాన కోర్సు ఉత్త‌ర్ణీత ఉండాలి

వ‌య‌స్సు అర్హ‌త

21 ఏండ్ల నుంచి 32 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.
వ‌య‌స్సు స‌డ‌లింపు…
ఎస్సీ, ఎస్టీ SC/ST : 5 సంవత్సరాల వరకు
ఓబీసీ (OBC) వర్గం: 3 సంవత్సరాల వరకు
మాజీ సైనికులు: 5 సంవత్సరాల వరకు
ద‌ర‌ఖాస్తు ఫీజు..
ఓబీసీ, ఇత‌ర అభ్య‌ర్థులుకు రూ.100.. (మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంది.)

ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌.. దీంట్లో రెండు ప‌రీక్ష‌లు ఉంటాయి.. మొత్తం 400 మార్కులు.. అబ్జెక్టివ్ ప్ర‌శ్నా విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్ అర్హ‌త సాధించిన వారు.. మెయిన్స్ ప‌రీక్ష‌లు రాసేందుకు అర్హ‌త సాధిస్తారు. మే 25 న ప్రిలిమ్స్ ప‌రీక్ష ఉండ‌నుంది.

మెయిన్స్ ప‌రీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్ లో ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించిన వారికి ఇంట‌ర్వూ ఉంటుంది.

పిలిమ్స్ ప‌రీక్ష కేంద్రాలు.. హైద‌రాబాద్‌, వరంగ‌ల్‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, అనంత‌పురం,

మెయిన్స్ ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ను పూర్తిగా చ‌ద‌వండి

ఈ లింక్ ను క్లిక్ చేసి పూర్తి నోటిఫికేష‌న్ చ‌దవొచ్చు… https://drive.google.com/file/d/1tIOUdsyam6fVwAhozrA38ffKqyqVQDtd/view

మరిన్ని తాజా ఎడ్యుకేష‌న్ వార్త‌ల కోసం మా వాట్స‌ప్ చానెల్ను ఫాలో చేయండి..https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

Laptops” మెగా ఎలక్ట్రానిక్స్ డేస్.. బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ల‌పై 40% వరకు తగ్గింపు

Appsc Group-1″ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల

RRB Group D” ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఆర్ ఆర్ బీ గ్రూపు డీ మొత్తం ఖాళీలు : 32438 పోస్టుల వారీగా వివ‌రాలు..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *