TGRJC-CET” పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజిల్లో ప్రవేశాలు పొందేందుకు టీజీఆర్ జేసీ సెట్ విడుదలయ్యింది. తెలంగాణాలో మొత్తం 35 తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో జనరల్ బాలురు 15 కళాశాలలు, జనరల్ బాలికలు 20 కళాశాలలున్నాయి.
ఇందులో ప్రవేశానికి అర్హతలు
a) అభ్యర్థి భారతదేశ నివాసి అయి ఉండాలి. మరియు మునుపటి తరగతులను తెలంగాణలో మాత్రమే చదివి ఉండాలి.
బి) మార్చి, 2025లో మొదటి ప్రయత్నంలోనే 10వ తరగతి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
– గత సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు కారు మరియు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 6 GPA మరియు BC, SC, ST అభ్యర్థులు 5 GPA మరియు అందరూ అభ్యర్థులకు ఆంగ్లంలో 4 GPA పొందాలి.
టీజీఆర్ జేసీ సెట్ పరీక్ష తేదీ: 10-05-2025 ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు.
పరీక్షా కేంద్రాలు:
1) ఆదిలాబాద్, 2) వరంగల్, 3) కరీంనగర్,
4) ఖమ్మం, 5) నిజామాబాద్, 6) నల్గొండ, 7) మహబూబ్ నగర్,
8) హైదరాబాద్ 9) రంగారెడ్డి 10) సంగారెడ్డి 11) సిద్దిపేట, 12) మెదక్
(అభ్యర్థి పరీక్ష రాయడానికి ఏదైనా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు)
9. పరీక్షా విధానం: ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లీష్ (ద్విభాష)లో జారీ చేయబడుతుంది.
కోర్సులు మరియు ప్రవేశ పరీక్ష మార్కులు
01 MPC ఇంగ్లీష్-గణితం-భౌతిక శాస్త్రం 2 ½ గంటలు 150
02 BPC ఇంగ్లీష్-బయో. సైన్స్-ఫిజికల్ సైన్స్ 2 ½ గంటలు 150
03 MEC ఇంగ్లీష్-సోషల్ స్టడీస్- మ్యాథమెటిక్స్ 2 ½ గంటలు 150
ఈ పరీక్ష 150 మార్కులకు 2½ గంటల వ్యవధితో ఆబ్జెక్టివ్ రకం (ప్రతి సబ్జెక్టుకు 50 మార్కులు). అభ్యర్థులు తమ సమాధానాలను OMR షీట్లలో గుర్తించాలి.
మోడల్ ప్రశ్నాపత్రాలు http://tgrjc.cgg.gov.in/వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
TGRJC CET ప్రశ్నాపత్రాలు తెలంగాణ రాష్ట్ర సిలబస్‌లో 10వ తరగతి సబ్జెక్టుల సిలబస్ ఆధారంగా ఉంటాయిజ. ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్‌లో ఉంటుంది.
దరఖాస్తు చేసేందుకు
2025-26 విద్యా సంవత్సరానికి 35 తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు http://tgrjc.cgg.gov.in/వెబ్సైట్ కి వెళ్లండి.
TGRJC కామన్ ఎంట్రన్స్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అభ్యర్థి ముందుగా సమాచార బులెటిన్‌ను జాగ్రత్తగా పరిశీలించి, TGRJC-CET 2025కి హాజరు కావడానికి వారి అర్హతను సంతృప్తి పరచాలి.
2. ఆన్లైన్ దరఖాస్తు కోసం షెడ్యూల్: 24-03-2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 23-04-2025 వరకు
3. పరీక్ష రుసుము: రూ.200/-
‘ఆన్లైన్’ ద్వారా దరఖాస్తును సమర్పించడంలో అనుసరించాల్సిన దశలు.
11. హాల్ టిక్కెట్ల జారీ:
అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను http://tgrjc.cgg.gov.in/ వెబ్సైట్ నుండి పరీక్షకు ఒక వారం ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు హాల్ టిక్కెట్లను వెబ్సైట్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ముద్రించిన హాల్ టికెట్ అభ్యర్థికి జారీ చేయబడదు/పోస్ట్ చేయబడదు.
హాల్ టికెట్ లేకుండా ఏ అభ్యర్థినీ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు.
12 ఫలితాల ప్రకటన: TGRJC CET-2025 పూర్తయిన తర్వాత వెబ్సైట్లో ప్రకటిస్తారు.
టీజీఆర్జేసీ సెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి పూర్తి వివరాలు క్షుణ్నంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేసుకోగలరు. డీసీ తెలుగువారు మీ అవగాహన కోసం సంక్షిప్తంగా మాత్రమే సమాచారం ఇవ్వబడింది. గమనించగలరు..
అధికారిక వెబ్సైటికి వెళ్లేందుకు https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/ ఈ లింక్ ను క్లిక్ చేయండి. .
కాలేజీల వివరాలు

[pdf-embedder url=”https://dctelugu.com/wp-content/uploads/2025/04/15187_2526_tsrjc2025_noti.pdf”]
Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుతమైన ఫోన్లు.. వివరాలు పరిశీలించండి..
Amazon Offer” గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ 70 శాతం తగ్గింపుతో..
Bhagyashree”వరుస ఆఫర్లతో భాగ్యశ్రీ.. ఈ ఏడాది చివరలో కాంత
Sannabiyyam: దేశంలోనే సన్నబియ్యం పథకం చారిత్రాత్మకం: మంత్రి పొన్నం ప్రభాకర్
Dell” తేలికగా విద్యార్థులకు ఉపయోపడే…. తక్కువ ధరలో డెల్ కంపెనీ నుంచి ల్యాప్ టాప్..
