China Bridge” వండర్లు సృష్టించడంలో చైనా ముందుంటుంది. తనకు ఎవరు లేరు పోటీ తనకు తానే సాటి అన్న రీతిలో చైనా అద్బుతాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెను నిర్మించింది. దీని ఎత్తు ఎంత అంటే 2050 అడుగులు………….. ఐఫిల్ టవర్ కంటే రెండింతల పొడవు, మూడింతల బరువు ఉండనుంది. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఓ లోయలో దీన్ని నిర్మించడంతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. 2022లో గుయ్ ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 280 మిలియన్ ఫౌండ్లు ఖర్చు చేశారు. మన ఇండియన్ కరెన్సీలో 2400 కోట్ల రూపాయలు… లియుజి మరియు అన్లాంగ్ ప్రాంతాల మధ్య ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 70 నిమిషాలు ఉంటుంది. అయితే బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమైతే నుండి కేవలం 60 సెకన్లలోనే వెళ్లొచ్చు. అంటే గంట పాటు పట్టే సమయం ఒక్క నిమిషంలోనే పూర్తవుతుందన్నమాట.. ఈ వంతెన జూన్‌లో ప్రారంభమవుతుందని అక్కడి ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జి ప్రారంభమైన తర్వాత చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో రవాణ సౌకర్యం మెరుగు పడనుంది. దీంతో పాటు టూరిజం స్పాట్‌గా నిలవనుంది. మొత్తం ప్రపంచలోనే 100 ఎత్తయిన వంతెనల్లో సగం చైనాలోనే ఉండడం విశేషం. ఇంకా దీని విశేషాలు చూసినట్టయితే వంతెన స్థలం దాని టవర్లలో ఒకదానిలో బార్ మరియు కేఫ్‌కు దారితీసే గ్లాస్ లిఫ్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. పర్యాటకులు “తేలుతూ” ఉండటానికి రహదారి స్థాయిలో గాజు అంతస్తులు ఉంటాయి.
TGRJC-CET” రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు..
Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుతమైన ఫోన్లు.. వివరాలు పరిశీలించండి..
New Airport”ఈ ఏయిర్పోర్ట్ ఇప్పటిది కాదు… స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ఏర్పాటు..
