Ntr district News” ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగుపై ఉన్న కాజ్‌వేపై భారీ వరద పొంగి పొర్లుతోంది. అతి కష్టం మీద ఓ లారీ ముందుకెళ్తున్నది. దాని వెనకే ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి వెళ్తున్నాడు. వరద ఉధృతికి బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దర్శి రామారావు శనివారం నందిగామ వెళ్తున్నాడు. ఈ క్రమంలో చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో వాగు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయాక రామారావు చెట్టు కొమ్మకు పట్టుకుని అలాగే ఉన్నాడు. గమనించిన పోలీసులు గ్రామస్తుల సహకారంతో అతడిని రక్షించారు.
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన యువకుడు
చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. pic.twitter.com/uDGLMZm1qU
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024
ఇవి కూడా చదవండి
Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో
Helicopter crash” గాల్లో హెలికాప్టర్ క్రాష్.. వీడియో
Nizamabad News” పెండ్లి విందులో మటన్ ముక్కలు రాలే.. వధువు, వరుడు వర్గాల మధ్య ఘర్షణ