ఏడు నెలల్లోనే తీర్పు
దాడి చేసి ఫారెస్ట్ ఆఫీసర్‌ను హ్యతచేసిన నిందితు లిద్దరికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు కోర్టు తీర్పు చెప్పింది. గతేడాది కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్రావు హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2022 నవంబర్ 22 న ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు ఎర్రబోడు అటవీ శాఖ ప్లాంటేషన్ తనిఖీ వెళ్లారు. అక్కడ గొత్తికోయలైన మడకం తులా, పొడియం సంగాలు పశువులు మేపుతుండడంతో వారిని అడ్డకున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి తేజావత్ రామారావుపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మృతి చెందారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితులిద్దరి జీవిత ఖైదు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.