ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పార్లమెంట్ ఎన్నికలలోపు లబ్దిదారులను గుర్తించి అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని బీజీపీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుండటంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పారు. 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారని బండి సంజయ్ తెలిపారు. వీరు కాకుండా ఇంకా చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో రేషన్ కార్డులేని వారిని ఆరుగ్యారెంటీలలో ఏ విధంగా వారిని గుర్తిస్తారని ప్రశ్నించారు. అసలైన పేదలను గుర్తించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు ఆరుగ్యారెంటీలు అమలు చేయాలని కోరారు. ఎన్నకల సాకు చూపి దరఖాస్తులకే పరిమిత కాకుడదన్నారు. హామిలిచ్చి అమలు చేయకుండా కాలయాపన చేసినందునే బీఆర్ ఎస్ ను ప్రజలు తిరస్కరించినట్టు గుర్తు చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. కేటీఆర్ ఇంకా భ్రమల్లో నే ఉన్నారన్నారు. ప్రజలు ఓడించినా అధికారంలోనే ఉన్నట్టు భ్రమపడుతున్నారని విమర్శించారు. 50 లక్షల కోట్ల ఆస్తి సృష్టిస్తే ఒకటో తారీఖు ఎందుకు జీతాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఎందుకు అమ్మారని అడిగారు. దళిత బంధు కూడా అందరికీ ఇవ్వలేదని విమర్శించారు.
బస్సుముందు ఘోరంగా కొట్టుకున్న మహిళలు .. కారణమేంటో
మీది నుంచి రైలు వెళ్లిన.. తన బిడ్డను కాపాడుకున్న తల్లి.. వీడియో వైరల్