క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్ ఆత్మ‌హ‌త్య

సిద్దిపేట జిల్లాలో క‌ల‌క‌లం చోటు చేసుకుంది. కలెక్ట‌ర్ గ‌న్‌మెన్‌గా ఉన్న వ్య‌క్తి భార్యా ఇద్దరు చిన్నారుల‌ను చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న హృద‌య విదాక‌ర ఘ‌ట‌న శుక్ర‌వారం చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలోని చిన్న‌కోడూరు మండ‌లంలోని రామునిప‌ట్ల గ్రామానికి చెందిన ఆకుల న‌రేశ్ సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ద్ద పీఎస్‌వోగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 15) ఉద‌యం విధులు ముగించుకుని న‌రేష్ త‌న వెంట పిస్ట‌ల్ ఇంటికి తెచ్చుకున్న‌డు. ఇంటికి వచ్చిన తరువాత ఆ పిస్ట‌ల్‌తో భార్య చైత‌న్య‌ను, ఇద్దరు చిన్నారులు కొడుకు రేవంత్‌, బిడ్డ హిమ‌శ్రీల‌ను కాల్చి చంపాడు. స‌మాచారం అందుకున్న పోలీస్ ఉన్నాతాధికారులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

 

య‌శోద ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి

మాజీ ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త తొల‌గింపు..

తెలంగాణలో పలువురు ఐఎఎస్‌ల బదిలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *