గ్రూప్‌ 2 పరీక్షలు మళ్లీ వాయిదా .. .?టెన్షన్‌లో అభ్యర్థులు

గ్రూప్‌ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. సమయం దగ్గర పడుతుంటం.. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకపోతుండటంతో ఈ సారి కూడా గ్రూప్‌ 2 ఉండదేమోనని అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేపర్‌ లీకేజీలు జరిగాయని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీలో కీలకంగా వ్యవహరించిన వారిని శిక్షించాలని నిరుద్యోగుల, రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా టీఎస్‌పీఎస్పీ చైర్మన్‌ సహ కొందరు సభ్యులు రాజీనామాలు చేయడంతో పరీక్షా నిర్వహిణ సాధ్యంకకనే వాయిదా వేసినట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 2 పరీక్షలకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో 783 ఉద్యోగాలకు 2023 జనవరిలో దరఖాస్తులను స్వీకరించింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలా 50వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా పేపర్‌ లీకేజీలు జరగడంతో వాయిదా వేశారు. తర్వాత నవంబర్‌ 2వ, 3వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో 2014 జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్‌పీ ప్రకటించింది.

బ‌స్సుముందు ఘోరంగా కొట్టుకున్న మ‌హిళ‌లు .. కార‌ణమేంటో

టీఎస్‌పీఎస్‌సీలో చైర్మన్‌ సహా సభ్యుల రాజీనామే కారణం…
టీఎస్‌పీఎస్‌సీలో చైర్మన్‌ సహా పలువురు సభ్యులు పేపర్‌ లీకేజీలకు పాల్పడ్డారని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. దీనివల్ల పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి టీఎస్‌పీఎసీ పైన విచారణ చేస్తామని, పేపర్‌ లీకేజీ కారకులను శిక్షిస్తామని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా ఉన్న జనార్దన్‌రెడ్డి తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్‌ ఆమోదించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపించారు. జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు కూడా తమ రాజీనామాలు చేశారు. అందరూ రాజీనామాలు చేయడంతోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం కుదరడం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనవరి 6, 7వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడినట్టేనని అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. ఇన్నిసార్లు వాయిదా వేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తేదీని మార్చుతుందా.. లేకపోతే ఇంకా పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందో చూడాలి.

 

మీది నుంచి రైలు వెళ్లిన.. త‌న బిడ్డ‌ను కాపాడుకున్న త‌ల్లి.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *