కళ్యాణ మండపంలో సీరియస్‌గా పెండ్లి జరుగుతంటది. వెనుక నుంచి ఆపండి అంటూ కేకలు..తీరా చూస్తే పోలీసులు రావడం పెండ్లి కొడుకు అరెస్ట్. ఇదంతా పాత సినిమాలో జరిగేవి. కానీ అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో చోటు చేసుకుంది. ఒక మద్యం షాపు, క్యాంటీన్ నుంచి 35 డబ్బాల్లో ఉన్న మద్యం సీసాలు, ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ దర్యాప్తు జరిపారు. చోరీ జరిగిన ప్రదేశంలో ఒక ద్విచక్రవాహనం , ఒక సెల్‌ఫొన్ ను గుర్తించారు. వీటి ఆధరంగా అలీఘడ్‌కు చెందిన ఫైజల్ గా గుర్తించారు. నిందితుడిని వెతుక్కుంటున్నపోలీసులకు పెండ్లి మండపంలో పెండ్లికొడుకుగా కనిపించాడు. వెంటనే అతడిన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో బంధువులందరూ పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. ఫైజల్ నేరం ఒప్పుకున్నాడు. కళ్యాణ మండపంలో ఒంటరిగా మిగిలింది. ఈ నేపథ్యంలో ఆమెను పెండ్లి చేసుకునేందుకు వరుడి అన్నయ్య ముందుకొచ్చాడు. వధువు ఒకే అనడంతో చివరకు వివాహం జరిగింది.
ఆడపిల్ల పుట్టిందని.. శిశువు నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి