ఇద్దరూ ఒకే వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు. తుదిశ్వాస మాత్రం ఒకేసారి వదిలారు. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘట న మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లిలో చోటుచేసుకుంది. నక్కలపల్లికి చెందిన మంగళారం అంతయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లకిë(55), చిన్న భార్య చంద్రమ్మ(40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యానికి గురై చిన్న భార్య చంద్రమ్మ మృతి చెందింది. ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే ఉదయం 7 గంటల ప్రాం తంలో పెద్ద భార్య లకిë కూడా మరణించింది. ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించడంతో భర్త అంతయ్య శోకసంద్రంలో మునిగిపోయాడు. పెద్ద భార్యకు పిల్లలు కాకపోవడంతో చిన్న భార్యను వివాహం చేసుకున్నాడు. చిన్న భార్యకు కుమారుడు వినరు (12) ఉన్నాడు. అయితే.. అంతయ్యది నిరుపేద కుటుం బం. ఆయన దగ్గర వారి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవు. ఈ విష యం తెలుసుకున్న స్థానిక నాయకుడు షాబాద్ దర్శన్ గ్రామానికి చేరుకుని ఆర్థిక సాయం అందించారు.
ఎక్కడ చూసినా శవాల గుట్టలే… లిబియా మరణాలు 20 వేలు
ఆడపిల్ల పుట్టిందని.. శిశువు నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి