మూడు వేల కోసం మామ‌ను చంపిన అలుళ్లు

రోజు రోజుకు మానవ సంబంధాలు మంట గ‌లుస్తున్నాయి.. మూడు వేల కోసం మామ‌ను చంపిన ఘ‌ట‌న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచిక‌ల్‌పేట మండ‌లంలోని లోడ్‌ప‌ల్లి గ్రామంలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. కాగ‌జ్ న‌గ‌ర్ రూర‌ల్ సీఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మండ‌లంలోని లోడ్‌ప‌ల్లి గ్రామానికి చెందిన పోతురాజుల భీమ‌య్య (52) పశువుల కాప‌రిగా ప‌నిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సేగం తిరుప‌తికి త‌న కూతురు అయిన స‌రితను ఇచ్చి పెండ్లి చేసిండు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం వారి మ‌ధ్య 3 వేల కోసం గొడ‌వ జ‌రుగున్న‌తున్నది . ఇదే స‌మ‌యంలో భీమ‌య్య మేన‌ల్లుడు మ‌ల్లేశం కూడా అక్క‌డ‌కు వచ్చాడు. ఇద్ద‌రు క‌లిసి మామ‌ను లేవ‌ట్టి కింద ఎత్తేశారు. దీంతో భీమ‌య్య త‌ల రోడ్డు మీద బ‌లంగా త‌గ‌లడంతో అక్క‌డే మృతి చెందాడు. భీమ‌య్య భార్య ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *