Nhrc telangana” నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
శంకరపట్నం: డీసీ ప్రతినిధి
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన బత్తుల రాజశేఖర్, డ్యాగతి హరీష్ నియమితులయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య వారి చేతికి అధికారిక నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ భద్రయ్య మాట్లాడుతూ, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో రాజశేఖర్ మరియు హరీష్ అందిస్తున్న కృషి అభినందనీయం అన్నారు. వారు ఇకపై కూడా నేషనల్ మరియు రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ఈ బాధ్యత తమకు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ భద్రయ్య, ఉపాధ్యక్షుడు రాము మరియు రాష్ట్ర నాయకులకు బత్తుల రాజశేఖర్, డ్యాగతి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు విలాసాగరం పృథ్వీరాజ్, వరంగల్ సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
