ముఖ్యఅతిథిగా శ్రీజ కంపెనీ సీఈవో జయతీర్థ చారి
తలుపుల : నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధర్యంలో ప్రారంభించిన ఫాడర్ అండ్ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎఫ్.పి. ఓ)మొదటి సర్వసభ్య సమావేశం మంగళవారం మండల కేంద్రంలోని ఆర్డిటి కార్యాలయంలో శ్రీజ కంపెనీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీజ కంపెనీ సీఈవో జయతీర్థ చారి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎఫ్.పి.ఓ శ్రీజ కంపెనీ సౌలభ్యంలో మొదటగా సత్యసాయి జిల్లాలో ప్రారంభించడం పాడి రైతుల అభివృద్ధికి నాంది అన్నారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విత్తన అభివృద్ధి సయలేజ్ గడ్డి పెంపకం వంటివి జరుగుతాయన్నారు.ఈ ఎఫ్.పి.ఓ ద్వారా పాడి రైతులకు లభించే సేవల గురించి సవివరంగ పాడి రైతులకు వివరించారు. ఎఫ్ పి ఓ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని ద్వారా పాడి రైతులకు సకాలంలో తక్కువ ధరలకు గడ్డిని అందించడం వారు పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.శ్రీజ కంపెనీ ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారు చిత్రావతి ఫాడర్ అండ్ అగ్రి(ఎఫ్.పి. ఓ )అని నామకరణం చేశారన్నారు.జలజల పారే చిత్రావతి నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సత్యసాయి జిల్లా రైతాంగం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమం పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం దీనికి సంబందించిన పాలకమండలి సభ్యుల ఎంపికతో పాటు పాడి రైతుల సహకారంతో చైర్మన్ ను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సిబ్బంది మహేష్, సచిన్, శ్రీజ డైరీ డీజీఎం తిమ్మప్ప, ఏజీఎం రాజేంద్ర బాబు,కదిరి ఏరియా మేనేజర్ లక్ష్మీరెడ్డి శ్రీజ సిబ్బంది,మరియు మహిళా పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.