రెండేండ్లుగా కడెం ప్రాజెక్టున కష్టాలు వెంటాడుతున్నాయి. గేట్లు కిందకి దించుతున్న క్రమంలో రోప్ తెగి నీటిలో పడిపోయింది. దీంతో నీరు మొత్తం వృథాగా పోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పెరగడంతో గేట్లు వదిలారు. ఈక్రమంలో మంగళవారం గేట్ల క్లోజ్ చేశారు. 15 వ గేటును కిందకి దించుతున్న క్రమంలో రోప్ తెగి గేటు వరద నీటిలో పడిపోయింది. దీంతో నీరు వృథాగా పోతోంది. జిల్లా వరప్రదాయినిని మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవలే కేంద్ర నిపుణుల బృందం ఈ డ్యాంపై పలు సూచనలు చేసి వెళ్లింది.
చదవండి ఇవి కూడా
కడెం ప్రాజెక్టుకు 65 ఏండ్లు.. ఇప్పుడు భద్రమా…? కాదా..?
మహిళల భద్రతకు ఆర్టీసీ “గమ్యం”