Viral News” పెండ్లయిన 40 రోజులకే తనకు విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది ఓ వివాహిత. పెండ్లయినప్పటి నుంచి తన భర్త స్నానం చేయట్లేదని వాపోయింది. 40 రోజుల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడని తెలిపింది. వివరాల్లోకివెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన రాజేశ్‌కు ఓ యువతితో వివాహమైంది. ఈ క్రమంలో రాజేశ్ స్నానం చేసేవాడు కాదని కేవలం వారానికోసారి మాత్రమే గంగాజలం చల్లుకుంటాడని చెప్పింది. దీంతో తన భర్తతో గొడవపడి పుట్టుంటికి వచ్చేసింది. యువతి తల్లిదండ్రులు రాజేశ్‌పై వేధింపుల కేసు పెట్టగా పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. కౌన్సెలింగ్‌లో రాజేశ్ పశ్చాతం చెంది రోజు పరిశ్రుభత పాటించేందు ఒప్పుకున్నాడు. కానీ యువతి మాత్రం అతనితో కలిసి ఉండేందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు మరోసారి కౌన్సిలింగ్‌కు రావాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
Karnataka News” సర్వీసింగ్ చేయలేదని షోరూంకు నిప్పు.. వీడియో