కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామన్నారని, ప్రజలు బిల్లులు చెల్లించవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. గృహజ్యోతి పథకంలో భాగంగా నాయకులు హామీనిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తుంది. అలాగే ఇది వరకు రూ. 5 లక్షలుగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంచారు.
ఉరేసుకుని తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి 200 యూనిట్ల కరెంట్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. దీని ప్రకారం కొత్త సంవత్సరం జనవరి 1 నుండి దీనిని అమలు చెయ్యాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నెలవారీ ప్రజలు 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని కోరారు. కరెంటు బిల్లులు వస్తే కట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
అదే విధంగా సీఎం రేవంత్ దృష్టికి కొన్ని అంశాలను తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు కొత్తగా దరఖాస్తులను తీసుకోకుండా పాత లెక్కల ప్రకారం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి వివరాలు మీసేవ, గ్రామాల్లో ఉన్నాయని వారికి సూచించారు. వాటి ప్రకారంగా కొనసాగించాలని పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన పెన్షన్ వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్హులకు పథకాలు చేరేలా చూడాలని తెలిపారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డులను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. ఇప్పటికే చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారని, అవి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రేషన్‌కార్డులను త్వరగా అందిస్తే ప్రజలు ప్రభుత్వ పథకాల అమలు అంత సులువు అవుతుందని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా తెలపడం లేదని అన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు కూడా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణా ప్రజలకు నా విన్నపం…200 యూనిట్లలోపు కరెంటు వాడకానికి బిల్లు కట్టకండి. బిల్లు కట్టనవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.
అలాగే…ఉన్న రేషన్ కార్డులకే పథకాలని సీఎం ప్రకటించడం విడ్డూరం. కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి.
ప్రభుత్వం నుండి పెన్షన్లు అందుతున్న… pic.twitter.com/N0IuTXfC3h
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 27, 2023
66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..
66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..