ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకుమార్తె ఇంట్లోనే ఉరేసుకున్నారు. తల్లి, సోదరి శవాలను చూసి తమ్ముడు తల్లడిల్లిపోయాడు. చెన్నైకి చెందిన మురుగన్, ధనలకిë దంపతులు కొన్నేండ్ల క్రితం మందమర్రికి వలసొచ్చారు. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఇక అప్పడాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ధనలకిë(36), ఆమె కుమార్తె జీవని(16) ఉరేసుకున్నారు. వారి కుమారుడు సిద్ధూ ఉదయం లేచి చూసేసరికి తల్లి, అక్క శవాలుగా కనిపించడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. అనంతరం తమ బంధువులకు సమాచారం అందించాడు.అయితే ప్రతి రోజు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ నిన్న రాత్రి నుంచి ఇంటికి రాకపోవడం, అతడి సెల్ ఫోన్ స్విచ్ఛాప్ కావడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఘటనాస్థలాన్ని మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Check Also
Jamili Elections” ఒకే దేశం.. ఒకే ఎన్నికకు కేంద్ర కేబినేట్ ఆమోదం
Jamili elections” ఎప్పటి నుంచో వినబడుతున్న జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు …
Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వన్.. 40 శాతం తగ్గింపుతో.. కేవలం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు
ఇల్లు తుడించేందుకు ఉపయోగపడే స్పిన్ మాప్ పై అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ తగ్గుదల ప్రకటించింది. 40 శాతం తగ్గింపు …
Bhatti Vikramarka” నిరుపేదల ఖాతాల్లో రూ.12 వేలు వేస్తాం: డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka” ఈ సంవత్సరం ను భూమిలేని పేదల బ్యాంకు అకౌంట్లలో 12 వేల రూపాయలు వేస్తామని తెలంగాణ డిప్యూటీ …