Finance Minister Sitharaman” కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సాధించారు. లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆరోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక రికార్డు. 2019 జులై నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినది. ప్రస్తుతం ఈ సారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ఆరోసారి బడ్జెంట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డులకెక్కారు. గతంలో చూసుకుంటే మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి తరువాత వరుసగా ఆరోసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈ ఘనత సాధించారు. మొరార్జీ దేశాయి ఆర్థిక మంత్రిగా 1959-1964 మధ్య ఐదు సార్లు పూర్తి స్థాయి వార్షిక బ్జడెట్‌లు, ఒక మధ్యంతర బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక శాఖ మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లు బ్జడెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ తరువాత పార్లమెంట్ లో బ్జడెట్ ప్రవేశ పెట్టిన రెండో మహిళా నిర్మలా సీతారామనే కావడం మరో విశేషం.
ఇవి కూడా చదవండి
elephant attacked” భూమ్మీద నూకలుండటం అంటే ఇదే.. వెంట్రుక మందంలో ప్రాణాలతో..
Ts Rtc ” వారిపై కఠిన చర్యలు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ హెచ్చరిక