Ganja” 2043 కిలోల పట్టుబడ్డ గంజాయిని శుక్రవారం నల్గొండ పోలీసులు కాల్చివేశారు. నల్గొండ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని నార్కట్‌పల్లి మండలం గుమ్మళ్లబావి గ్రామంలో శుక్రవారం ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షణలో పోలీసులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన సుమారు రూ.5.10 కోట్ల విలువ చేసే గంజాయిని కోర్టు అనుమతులతో దహనం చేశామన్నారు. డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. డగ్స్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
Harsih rao” రాజీనామాపత్రంతో గన్‌పార్క్‌కు హరీశ్‌రావు..
Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా.. వీడియో వైరల్
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో