Harsih rao” ఆగస్టు 15 తారీఖులోపు రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు హరీశ్‌రావు వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15తారీఖులోపు హామీలను అన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే నేను ఇచ్చిన సవాలను స్వీకరించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఏతో అయినా లేదా స్టాఫ్‌తో అయినా రాజీనామా లేఖను పంపించాలని సూచించారు. జర్నలిస్టుల సాక్షిగా లేదా మేధావుల చేతిలో తన రిజైన్ లెటర్‌ను పెడుతున్నానని చెప్పారు. ఆగస్టు 15 లోగా ఒకేసారి రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు అమలు చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పితే రాజీనామా చేయాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి
Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా.. వీడియో వైరల్
ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో