Kcr Tweet” బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శనివారమే సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచారు. మొదటి రోజే ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు. భోజనం చేస్తుంటే కరెంట్ పోయిందని ట్వీట్ చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. దీనిపై కరెంట్ కోతలు లేవని లేనిపోని అబద్దాలతో మాజీ కేసీఆర్ దుష్పచ్రారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.
అసలేంజరిగిందంటే..
శనివారమే ఎక్స్ ఖాతా తెరిచిన (Kcr Tweet)మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కరెంట్ కోతలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. (Kcr Tweet)మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో నేను గంట క్రితం మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయింది. రోజూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు కోతలు లేవని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని నాకు చెప్పారు. రాష్టాన్న్రి పరిపాలిస్తున్న కాంగ్రెస్ వైఫల్యానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది.? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని (Kcr Tweet) కేసీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది.
ప్రతి రోజు…
— KCR (@KCRBRSPresident) April 27, 2024
కెసిఆర్ కరెంట్ కోతలు ఉత్తిదే
ట్వీట్‌పై సిఎం రేవంత్ స్పందన
అయితే కేసీఆర్ ఎక్స్ ట్వీట్ పై స్పందించారు. (Cm Revanth reddy) సీఎం రేవంత్ రెడ్డి… వెంటనే విచారణకు ఆదేశించారు. లేనిపోని అబద్దాలతో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు. మొన్న సూర్యాపేటలోనూ కరెంట్ పోయిందని అబద్ధం చెప్పారని విమర్శించారు. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లోనూ అలాంటి అబద్దాలే చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్‌కు మరీ ఇంత అధికార వ్యామోహం ఎందుకని ప్రశ్నించారు. ఓడినా కూడా కేసీఆర్ కు ఇంకా గర్వం తగ్గలేదన్నారు.
ఇవి కూడా చదవండి
Harsih rao” రాజీనామాపత్రంతో గన్‌పార్క్‌కు హరీశ్‌రావు..
Ganja”పట్టుబడ్డ 2043 కిలోల గంజాయి దహనం
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో