Runa mafi” కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ కీలకమైనది. ఇప్పటికే మొదటి విడత కొంతమంది రైతులకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో విడతకూ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 1.50 లక్షల్లోపు రూపాయల పంటరుణం ఉన్న ప్రతి ఒక రైతుకు జులై 31 కంటే ముందే రెండో విడత మాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు జులై 30న (మంగళవారం) లక్షన్నర లోపు చెక్కుల ఆవిష్కరణ అసెంబ్లీలో ఆవరణలో ఉంటుందని సమాచారం. దీంతో ఈ నెలాఖరుకల్లా లక్షన్నర లోపు పంట రుణాలు మాఫీ కానున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో లక్షరూపాయల మేరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు జులై నెలచివరకు వరకు లక్షన్నర రూపాయలు ఉన్నరుణాలు మాఫీ కానున్నాయి. మూడో విడత ఆగష్టు నెల 15 నాటికి మొత్తం రెండు లక్షల రూపాయల రుణాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఇవి కూడా చదవండి
atal setu”15 సెకన్లలోనే ఆత్మహత్య .. సీసీవీడియో
Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి పడి ఒకరు మృతి..
Tamilanadu Crime news” దారుణ హత్య.. వీడియో వైరల్
Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్నదమ్ములు స్పాట్ డెడ్
Cyber crime news” రూపాయికి వందవస్తుందంటే అనుమానించాల్సిందే..వీడియో