కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నరు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు. బరి గీసి చింతా ప్రభాకర్ ను గెలిపించుకుంటామన్నారని, గెలిపించుకున్నారని చెప్పారు. ప్రతీ కార్యకర్త తానే అభ్యర్థి ననుకుని పని చేశారని వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. కొన్ని స్థానాలు స్వల్ప మెజారిటీ తో కోల్పోయామని తెలిపారు. దురదృష్టశావత్తు మనం అధికారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ కు ఒడిదొడుకులు కొత్త కాదని చెప్పారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్ధి కుంగి పోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడని చెప్పారు. రానున్న రోజుల్లో స్థానిక ,పార్లమెంట్ ఎన్నికల రూపం లో పరీక్షలు రాబోతున్నాయ్ వాటిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యచరణతో ముందుకుపోతామని చెప్పారు. కేసీఆర్ పాలన లో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని గుర్తు చేశారు. వాళ్ళు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని, దుష్ప్రచారం కూడా కొంత పై చేయి సాధించిందన్నారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. బీఆర్ ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమే, తెలంగాణ తెచ్చిన పార్టీ బీ ఆర్ ఎస్ ..గెలిచినప్పుడు పొంగి పోలేదు ..ఓటమి తో కుంగి పోలేదని సూచించారు. వాళ్ళిచ్చిన హామీల అమలు లో విఫలం అయితే ప్రజా గొంతుక అవుమన్నారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు ..మనం ధైర్యం కోల్పోవద్దని కార్యకర్తలకు సూచించారు. ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని, మనకు పోరాటాలు కొత్త కాదు ..భవిష్యత్ మనదే ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎస్‌ల బదిలీ హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి