Helicopter At Nalgonda” గాలి పెద్దగా సౌండ్ అయితేనే హెలికాప్టర్ పోతుందని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆసక్తి చూస్తాం. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎక్కడో చిన్న పక్షిలాగా. కనిపడే హెలికాప్టర్ ను చూసి సంబురపడుతాం. అదే గాలిమోటార్ ( హెలికాప్టర్) అకస్మాత్తుగా వచ్చి పక్కనే మన పొలాల మధ్య ల్యాండ్ అయితే?.. ఎట్లా ఉంటుంది. ఆ ఊరు ప్రజలు సంబురమాశ్చర్యాలకు గురవుతారు. అటువంటి ఘటనే నల్లొండ జిల్లా చిట్యాల పొలాల్లో కనపడింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు పోతున్నఒక (గాలిమోటార్) హెలికాప్టర్ చిట్యాల శివారులోని పొలాల మద్య ఎమర్జెన్సీగా ల్యాండింగ్ అయింది. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పంట పొలాల మధ్య ల్యాండ్ చేశారు. అందులో ఉన్న ముగ్గురు అధికారులు సేఫ్‌గా ఉన్నారు. విషయం తెలుసుకున్నఎయిర్ పోర్స్ అధికారులు మరో హెలికాప్టర్ ను అక్కడి పంపారు. హెలికాప్టర్ ల్యాండ్ అవడం చూసిన రైతులు, రైతు కూలీలు ఆశ్చర్యంగా చూశారు. హెలికాప్టర్ ఎదుట ఫొటోలు దిగుతూ ఆనందపడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివాసముండేవారికి హెలికాప్టర్లు, విమానాలను చూడడమనేది చాలా అరుదు. మరీ ఇంతలా దగ్గర నుంచి చూసే చాన్స్ మాత్రం అందరికీ రాదు. నిత్యం పనుల్లో తీరిక లేకుండా ఉండే రైతులు, రైతు కూలీలు హెలికాప్టర్‌ను చూసి తెగ సంబుర పడ్డారు.
పొలాల్లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంవనిపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాల్లో pic.twitter.com/2NzaJ6muEU
— M Rk reddy (@meegadakoti) September 6, 2024