Mla Kavvampalli” నేటి కరీంనగర్- శంకరపట్నం
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకొని శ్రద్ధతో చదువుతూ క్రీడల్లో రాణిస్తే మానసిక ఉల్లాసం మేధస్సు పెరుగుతుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారంఎమ్మెల్యే సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే విద్యతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకొని శ్రద్ధగా చదువుతూ క్రీడల్లో రాణిస్తే మేధాస్తు పెరుగుతూ మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణలోని ప్రజా ప్రభుత్వము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కార్పొరేట్ విద్యా వసతులను ఏర్పాట్లను భోజన వసతులను కల్పించడం జరుగుతుందని, విద్యార్థులను ప్రోత్సహించే అందుకే ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలు గ్రామాల నుండి మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మండల స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుందని మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నియోజకవర్గ క్రీడా పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, నియోజకవర్గ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి ముఖ్యమంత్రి కప్ కు ఎంపిక చేయడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడల పై ఆసక్తి పెంచుకొని క్రీడల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, తాసిల్దార్ కే సురేఖ, గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయ్ కుమార్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, ఉప సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గొట్టె మధు, శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మాజీ ఎంపీటీసీ ఉప్పుగల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, పాలకవర్గ సభ్యులు, వివిధ ప్రభుత్వ పాఠశాలల పీడీలు, ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
//////////////////////////////////////////////////////////////////////////
గ్రామ ప్రజల ఇబ్బందులు తీర్చాలి…

కొత్తగట్టు గ్రామస్తుల నిరసన….
నేటి కరీంనగర్: శంకరపట్నం:
జాతీయ రహదారి రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ వెంగళ విజేందర్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో ఎన్ హెచ్ 563 జాతీయ రహదారి నిర్మాణం కావడంతో గ్రామస్తులకు రైతులకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామ ప్రజల రైతుల సమస్యలను పరిష్కరించి జాతీయ రహదారి పనులు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
