మాజీ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో కాలు జారి పడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఎడమ కాలు తుంటి విరిగినట్టు నిర్దారించారు. దీనికి సంబంధించి సర్జరీ చేయాల్సి ఉండగా కాసేపటి క్రితం వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. యశోధ ఆస్పత్రికి బీఆర్ ఎస్ నాయకులు భారీగానే చేరుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్య సభ ఎంపీ సంతోష్‌రావు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మనువడు హిమాన్ష్ తోపాటు తదితరులు ఆస్పత్రిలో ఉన్నారు. దానికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ థియేటర్ లోకి కేసీఅర్ ను తీసుకెళ్లిన డాక్టర్ల బృందం..
Get Well Soon Sir 🙏🙏#KCR #BRSParty #KCRHealth #Hyderabad #Telangana pic.twitter.com/EKIkMG4WZP— RajeshGangireddy (@RajeshmudirajG) December 8, 2023
రేపటి నుంచే బస్ ఫ్రీ .. రూల్స్ ఇవే..
దేశానికి అధ్యక్షుడి అవుతావు బుడ్డోడా.. విమానంలో చిన్నపిల్లాడి కి ఫిదా
ఇంట్లో జారిపడ్డ కేసీఆర్.. యశోదలో చికిత్స..