Korutla” జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన హితాక్షి (5) హత్య కేసు ఇప్పుడు కొత్త కోణంలోకి మలుపు తిరిగింది. కుటుంబ కలహాలే ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. పిన్ని మమతే హితాక్షిని హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి:
కోరుట్ల ఆదర్శనగర్‌కు చెందిన ఆకుల రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు సోదరులు. వీరిద్దరూ వరుస అక్కాచెల్లెళ్లైన నవీన, మమతలతో వివాహం చేసుకున్నారు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న ఈ కుటుంబానికి సంబంధించి రాము-నవీన దంపతులకు వేదాంశ్, హితాక్షి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు లక్ష్మణ్-మమతలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మమత ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.18 లక్షలు కోల్పోయింది. ఆర్థికంగా కుదేలైన ఆమె, ఇంట్లో తనకంటే నవీనకు ఎక్కువ ప్రాధాన్యం కలుగుతోందని భావించి ఆమె పట్ల ద్వేషం పెంచుకుంది. ఈ క్రమంలో నవీన కుమార్తె హితాక్షిని హతమార్చాలని ఆమె పక్కా పన్నాగం వేసింది.
జూన్ 29 (శనివారం) సాయంత్రం, పిల్లలతో కలిసి పెద్దపులుల వేషధారణలు చూస్తామంటూ హితాక్షిని తనతో తీసుకెళ్లింది. అప్పటికే ఆమె దగ్గర కూరగాయలు కోసే కత్తి, చెట్లు కత్తిరించే కట్టర్ ఉన్నాయి. సమీపంలోని ఓ అపరిచిత ఇంట్లో గేటు, బాత్‌రూం డోర్ లేనందున, అక్కడికి హితాక్షిని తీసుకెళ్లింది.
ఆ బాత్‌రూంలో చిన్నారిని పడేసి, మొదట కత్తితో గొంతు కోసి, ఆపై కట్టర్‌తో మెడ కోసి హత్య చేసింది. అనంతరం ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకొని, మిగిలినవారితో కలిసి హితాక్షిని వెతికే నాటకమాడింది.
చిన్నారి మృతదేహం దొరికిన తరువాత, ఆసుపత్రిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె బోరున విలపించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం మమతపై కేసు నమోదు చేసి, ఆమె ఒంటరిగా హత్యచేసిందా లేదా ఇంకా ఎవ్వరైనా మద్దతుదారులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Texas floods” టెక్సాస్‌లో భారీ వర్షాలు .. అనూహ్య వరదలు వరదలు, 24 మంది మృతి
