కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు బస్ ఫ్రీ ఒకటి. గురువారం కొలువు దీరిన కొత్త ప్రభుత్వం హామీలను ఎప్పుడు నెరవేరస్తుందోనని అందరిలో నెలకొన్న ఆలోచన. అయితే శనివారం 09.12.2023 రోజు న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా రెండు గ్యారంటీల ను అమలు చేస్తారని పొద్టటి నుంచి అందుతున్న సమాచారం. అయితే దీనికి అందుకు అనుగుణంగానే శుక్రవారం సాయంత్రం గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మీ అమలుకు జీ.ను విడుదల చేసింది ప్రభుత్వం. శనివారం పొద్దున్న నుంచి వయస్సుతో సంబంధం లేకుండ చిన్నారులు, బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఫ్రీగా బస్సు సౌకర్యం ఉండనుంది. తెలంగాణ సరిహద్దుల్లో ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉండనుంది. ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మీ స్మార్ట్ కార్డు ను రూపొందించనున్నట్టు జీవో లో పేర్కొన్నారు. పథకం అమలుకు ఆర్టీసీ అవసరమైన చర్యలు తీసుకుని వివరాణాత్మక సూచనలు జారీ చేస్తుందని జీవోలో తెలిపారు.
Free Bus Travel for Women From Tomorrow🚍✅
📜 GO జారీ చేయబడింది:
మహా లక్ష్మి పథకం –
RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం. 🚍📜 GO issued:
Maha Lakshmi Scheme – Free travel for women in RTC buses.🚍#RevanthReddy @revanth_anumula pic.twitter.com/viIzOWmvkE— Congress for Telangana (@Congress4TS) December 8, 2023
దేశానికి అధ్యక్షుడి అవుతావు బుడ్డోడా.. విమానంలో చిన్నపిల్లాడి కి ఫిదా
ఇంట్లో జారిపడ్డ కేసీఆర్.. యశోదలో చికిత్స..
ఐటీ దాడులు బయట పడ్డ నోట్ల కట్టలు