Saturday , 22 June 2024
Breaking News

రేవంత్‌ను వ‌దిలిపెట్ట‌బోం.. హామీలు ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం కేటీఆర్

ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి అలవిగాని హావిూలు ఇచ్చారని, ఆయన ప్రతి మాటకూ తమ వద్ద రికార్డు ఉందనీ మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ను వదిలిపెట్ట బోమన్నారు. ఆయన బుధవారం విూడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారని, నాలుగువేల రూపాయల పెన్షన్‌ కూడా ఇస్తామని హావిూ ఇచ్చారని కేటీఆర్‌ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా 15 వేల రూపాయలను రైతు భరోసా కింద అందజేస్తామని చెప్పి, ఇంకా ఇవ్వలేదని అన్నారు. రుణమాఫీ చేయడానికి తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేటీఆర్‌ చెబుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ ఎలా చేస్తుందో చూస్తామన్నారు. తాము చేసిన ప్రతి అప్పుకూ ఆడిటి రిపోర్ట్‌ ఉందన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చేముందు ఆదాయావ్యయాల లెక్కలు చూసుకుంటారని, కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇలా మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. లెక్కలు వేసుకుని హావిూలు ఇస్తారా ? హావిూలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలు చాలా ఉన్నాయన్న ఆయన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. కాంగ్రెస్‌ పాలకులకు అసలు ఆట ఇప్పుడుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హావిూలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. శాసనసభ ఆవరణలో విూడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. రాష్టాన్న్రిఅప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారంటూ….కొత్త కథలు చెప్తారని అన్నారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు కేటీఆర్‌. ప్రతి ఏడాది కాగ్‌ నివేదికలు ఇస్తున్నారని.. ఆడిట్‌ లెక్కలు తీస్తున్నారని స్పష్టం చేశారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామన్నారని, అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి రాష్టాన్న్రి సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల్లోని రెండు పథకాలైన మహలకిë, చేయూత పథకాల్ని ప్రారంభించారు. మహాలకిë పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది కాంగ్రెస్‌. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య, సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్‌ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. మహాలకిë పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం 500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ కల్పిస్తామని హావిూ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్‌. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హావిూలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.

 

డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్ర‌జా భ‌వ‌న్

పార్లమెంటులో ఇద్దరు ఆగంతకుల కలకలం

 

About Dc Telugu

Check Also

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

chai pepsi

chai pepsi” ఇదేంద‌య్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైర‌ల్

chai pepsi”  చాయ్ చ‌టుక్కునా తాగారా బాయ్ అనే పాట ఎంతో ఫేమ‌సో మ‌నందరికీ తెలుసు.. కొన్ని ప్రాంతాల్లో టీ …

Cyberabad Police"

Cyberabad Police” పిల్ల‌లు స్కూల్‌కి సుర‌క్షితంగా వెళ్లాంటే త‌ల్లిదండ్రులు ఇవి పాటించండి.. సైబరాబ‌ద్ పోలీసుల సూచ‌న‌లు

Cyberabad Police”  చిన్న‌పిల్ల‌లు స్కూల్‌కి వెళ్లే సంద‌ర్భంలో కొన్ని సార్లు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి.. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగితే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com