Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువ‌గా చోటు చేసుకుంటాయి. ఈ వీడియో చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అంద‌రినీ ఆలోచింప చేస్తున్న‌ది. ఓ అబ్బాయి కూర‌గాయ‌లు అమ్ముకుంటు జీవ‌నం సాగిస్తున్నాడు. ఈ క్ర‌మంలో నార్త్ ఈస్ట్ (delhi) ఢిల్లీలోని య‌మునా విహార్‌లో ఓ కాల‌నీకి కూర‌గాయ‌లు అమ్ముకునేందుకు వెళ్లాడు. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. ఇండ్ల మ‌ధ్య‌లో పార్క్ చేసిన వాహ‌నాలు త‌ప్ప ఎవ‌రు లేరు. ఇంత‌లో ముందుగా ఒక వ్య‌క్తి కూర‌గాయ‌లు అమ్ముకునే వ్య‌క్తి సమీపం నుంచి వెళ్తున్న‌ట్టు క‌న‌బ‌డుతాడు. కొద్దిగా వెళ్లిన‌ట్టు వెళ్లి కూర‌గాయ‌లు అమ్ముకునే వ్య‌క్తి గొంతును గ‌ట్టి ప‌ట్టుకుంటాడు. ఇంత‌లో మ‌రో వ్య‌క్తి వ‌చ్చి అతని పై దాడి చేస్తాడు. ఓ ఇంటి గోడ‌స‌మీపానికి తీసుకెళ్లి బ‌ల‌వంతంగా అత‌ని ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు గుంజుకుని అక్క‌డి నుంచి ప‌రారవుతారు. ఇంత జ‌రుగుతున్న ఏ ఒక్క‌రూ ఇండ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న 21 జులై 2024న జ‌ర‌గ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బ‌స్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది

Rain alert” ఈ జిల్లాల్లో రేపు భారీ వ‌ర్షాలు

Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన త‌మ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *