కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ ఎస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇస్తామన్న హామీల అమలుకు డిమాండ్ చేస్తోంది బీఆర్ ఎస్. ఇప్పటికే రెండు మూడు సార్లు హామీల గురించి మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావించడంతో మంత్రులు ఫైర్ అయ్యారు. మంత్రి సీతక్క కూడా స్పందింస్తూ కేటీఆర్ కు కౌంటర్లు వేసింది. అయితే తాజాగా కేటీఆర్ ఓ ట్విట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ ఎందుకు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య కూడా హామీల అమలుకు డబ్బులు లేవనే సాకుతో ఆలస్యం చేస్తున్నారని అక్కడి పరిస్థితులే తెలంగాణలో రిపీట్ అవుతున్నాయని మంగళవారం తన ట్విట్టర్ వేదికగా ద్వారా విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా ఆరు గ్యారంటీలను అమలుకావడం లేదని అన్నారు.
తెలంగాణాలోనూ భవిష్యత్ ఇదేనా…? కేటీఆర్ ట్వీట్ ..
మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హామీలు ఇచ్చే ముందు ఒక్కసారి ఆర్థిక అంశాలపై పరిశీలన చేసుకోకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దెవా చేశారు. ఈ విపరీత హామీల వల్ల తెలంగాణలో ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారుతుందేమోనని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అప్పులు ఉన్నాయని దాటవేస్తున్నారని, ఇది సరైంది కాదని పేర్కొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఓ వీడియోను రీ ట్వీట్ చేశారు. దీనికి ఎన్నికల వాగ్దానాలు, హామీలు ఇవ్వడానికి డబ్బులేదనడాన్ని తప్పుబట్టారు. విపరీతమైన ప్రకటనలు చేసే ముందు మీరు ప్రాథమిక పరిశోధన, ప్రణాళిక చేయకూడాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా అంటూ ప్రశ్నించారు.
లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి రాయించుకొని.. కుటుంబాన్నిచంపిన దుర్మార్గుడు..
రోహిత్, హార్థిక్ .. మధ్యలో అంబానీ బుజ్జగింపులు.. ఫ్యాన్స్ ట్రోల్స్… వీడియో వైరల్