విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల ప్రమాదంపై యూ ట్యూబర్ లోకల్ బారు నాని హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణకు వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదని, ఆ సమయంలో తాను వేరే ప్లేస్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చానని చెప్పారు. రాత్రి 11.45 గంటల సమయంలో బోట్లు తగల బడుతున్నట్లు ఫోన్ వచ్చిందని, వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విూదుగా హార్బర్‌కు వెళ్లానన్నారు. తాను వెళ్ళే సమయానికి బోట్లు తగల బడుతున్నాయని తెలిపారు. అయితే తాను అప్పటికే మద్యం సేవించి ఉన్నానని చెప్పారు.
తాను హార్బర్‌కు వెల్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిందని నాని తెలిపారు. ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే తీశానని, అయితే వీడియోలు తీస్తున్న తనను కొందరు కొట్టే ప్రయత్నం చేశారన్నారు. వీడియో తీసి పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని, విచారణ కోసం రావాలని కొరటంతో వెళ్ళానన్నారు. తానే బోట్లు తగల బెట్టానని పోలీసులు పేర్కొంటూ చేయి చేసుకున్నారని, లాటీతో కొట్టారని చెప్పారు. ప్రమాదం జరిగే సమయంలో తాను హోటల్‌లో ఉన్నానని, ఆ హోటల్‌లో సీసీ టీవి ఫుటేజ్‌లో కూడా ఉన్నానన్నారు. కోర్టులో పిటిషన్ వేయక పోతే పోలీసులు తనను అంతం చేసేవారని లోకల్ బారు నానీ పేర్కొన్నారు. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బారు నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని.. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులు మూడు రోజుల పాటు నన్ను నిర్బంధించారు. గర్భిణి అయిన నా భార్య ఎంతో ఆందోళనకు గురైంది. ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.. అంతేకాదు.. కోర్టులో పిటిషన్ వేయక పోతే పోలీసులు నన్ను అంతం చేసే వారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులనూ వేధిస్తున్నారని నాని ఆరోపించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బారు నానిని అదుపులోకి తీసుకున్న విశాఖ వన్ టౌన్ పోలీసులు.. అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.. ఈ అగ్నిప్రమాదానికి నానియే కారణం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో, అతడిని మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.. అయితే, నానిని అక్రమంగా పోలీసులు బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పోలీసులు నానిని రిలీజ్ చేశారు.. తనను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్ దాఖలు చేయడంతో.. విశాఖ పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఆస్ట్రేలియా క్రికెటర్‌పై ఢిల్లీలో కేసు నమోదు
కారు దగ్ధం బయట పడ్డ నోట్ల కట్టలు