కారు దగ్ధం బ‌య‌ట ప‌డ్డ నోట్ల కట్టలు

వ‌రంగ‌ల్ : తెలంగాణ అసెంబ్లీ ఎల‌క్ష‌న్ వేళ నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. అక్రమంగా న‌గ‌దు తరలిస్తున్న ఓ కారు వరంగల్‌ జిల్లాలో శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 24) అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి పోలీసుల కండ్లు గప్పి నోట్ల‌ను త‌ర‌లిస్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వరంగల్ నుంచి వ‌ర్ధ‌న్న‌పేట వైపు వెళ్తున్న కారు బొల్లికుంట క్రాస్ రోడ్ వ‌ద్ద‌కు రాగానే ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దట్ట‌మైన పొగ‌లు రావ‌డంతో అందులోని డ్రైవ‌ర్ కారును నిలిపివేసి అక్క‌డి నుంచి పారిపోయాడు. కారులో ఉన్న న‌గ‌దు రూ. 30 ల‌క్ష‌ల నుంచి రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కారును పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

స్కూళ్ల‌కు రెండు రోజులు… బ్యాంకుల‌కు మూడు రోజులు సెలవులు

బైక్‌ను ఢీకొట్టిన స్కూలు బస్సు కూతురు మృతి.. తండ్రికి గాయాలు

యానిమల్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది ర‌ణ్‌బీర్‌, రష్మికల కాంబినేషన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *