Thursday , 12 September 2024
Breaking News

పీఎం నరేంద్ర మోడీ వాగ్ధానాన్ని విస్మ‌రించారు: న్యూడెమెక్ర‌సి

నిజామాబాద్ ప్ర‌తినిధి నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే పిట్ల యెల్లన్నకు నిజమైన నివాళి అని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. భీంగ‌ల్ ప‌ట్ట‌ణంలో పిట్ల ఎల్ల‌న్న వ‌ర్ధంతి స‌భ‌ను శ‌నివారం నిర్వహించారు. ఎల్లన్న పేదింటిలో పుట్టి కష్టజీవుల రాజ్యం కోసం కదం తొక్కాడని ఆయన అన్నారు. రైతు కూలీ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి జనం హృదయంలో పదిలంగా నిలిచారని చెప్పారు. మీకోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం పోరాడుతున్నామని పీపుల్స్ వార్ చెప్పి యెల్లన్నను చంపడం విచారకరమని ఆయన అన్నారు. అన్నదాత ఆకలితో అనేక సమస్యలతో సతమత మౌతున్నారని ఆయన అన్నారు. మోడీ రైతు వ్యతిరేక మూడు చట్టాలను తిరిగి అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎల్లన్న జీవితం ప్రజా ఉద్యమకారులకు స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. దోపిడీ లేని వ్యవస్థ కై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. పి ఓ డబ్ల్యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిమంగ మాట్లాడుతూ .. దేశంలో మహిళలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, రెండవ శ్రేనీ పౌరులుగా గుర్తిస్తున్నారనీ ఆమె అన్నారు. మోడీ సర్కార్ మహిళలను బానిసలుగా మార్చుతుందన్నారు. మోడీ సర్కార్ దేశాన్ని అప్పుల కొంపగా మార్చిందని ఆమె విమర్శించారు. పోరాడకుండా బతుకు మారదని, పోరాడి జీవితాలను మార్చుకుందామని పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ.. జననం మరణం సహజమే కానీ పీడిత ప్రజల కోసం మరణించడం ఉన్నతమని ఆయన అన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు, పేద ప్రజలకు జన్ధన్ ఖాతాలో 15 లక్షల జమ, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువుల మాట నీళ్ల మూటగా మారాయని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను, హరిస్తూ, ఉద్యమకారులను నిర్బంధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మత విద్వేషాలను పెంచి, మానవ విలువలకు విఘాథం కలిగిస్తున్నారని ఆయన తెలిపారు. దేశ సంపదను అంబానీ, ఆదాని లాంటి కార్పోరేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పుతున్నారని ఆయన అన్నారు.

పీఎం నరేంద్ర మోడీ వాగ్ధానాన్ని విస్మ‌రించారు: న్యూడెమెక్ర‌సి

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ, మున్సిపల్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల పెర్మనెంట్ విషయం ఆలోచించి కార్మికులకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన కోరారు. మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు పిట్ల సరిత మాట్లాడుతూ.. మా నాన్న ఎల్లన్న ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఎర్రజెండా ముసుగులో కొందరు హతమార్చడం బాదేస్తుందని ఆయన అన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ,శక్తులు ఐక్యం కావాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సూర్య శివాజీ మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమను కాపాడాలని, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాల పై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భీంగల్ పట్టణంలో శివా గార్డెన్లో జరిగిన ఎల్లన్న స్మారక సభకు న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి ఎండి కాజా మొయినుద్దీన్ అధ్యక్షత వహించారు. ఈ సభ లో సిరికొండ సబ్ డివిజన్ కార్యదర్శి వి‌.బాలయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురేష్ బాబు, ఎస్కే అబ్దుల్, ఎఐకెఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పిట్ల మార్క్స్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి. ప్రిన్స్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, జిల్లా అధ్యక్షులు బి‌. భూమయ్య, పిడిఎస్సియు రాజేశ్వర్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. భీంగల్ పట్టణంలోని ఎల్లన్న స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం భీంగల్ పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
అరుణోదయ కళాకారులు డప్పు చప్పుళ్లతో ఆట,పాటలతో ప్రజలను అమితంగా ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ సబ్ డివిజన్ నాయకులు లింబాద్రి, ధర్మపురి, మల్కీ.సంజీవ్, వి పద్మ,, భూమేష్, అరుణోదయ కళాకారులు దాల్మల్కి పోశెట్టి, రంజిత్, భారతి, తదితరులు పాల్గొన్నారు.

 

సీఎం రేవంత్‌రెడ్డి వ‌ర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్

సలార్‌ తొలి టిక్కెట్‌ కొన్న జక్కన్న

తొమ్మిదిమంది ఐఎఎస్‌ల బదిలీ

About Dc Telugu

Check Also

flood Viral Video

flood Viral Video” ఎందుకు నాయనా అంత తొంద‌రా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైర‌ల్

flood Viral Video” ఉత్సాహం పెంచుమీరితే ప్రాణం మీదికొస్తది. అంద‌రూ త‌మ‌ను పొగ‌డాల‌నో, త‌మ‌ను ప్ర‌త్యేకంగా చూడాల‌నో కొన్ని పిచ్చి …

Viral Video

Viral Video” అదిరంద‌య్యా.. లేటెస్ట్ గుర్ర‌పు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైర‌ల్‌

Viral Video”   ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోలు, జీపులు రాక‌ముందు మ‌నుషులు ర‌వాణా కోసం గుర్ర‌పు బండ్ల‌ను ఉప‌యోగించారు. సాంకేతిక‌త పెరిగినంకా గుర్ర‌పు …

Xiaomi Power Bank

Xiaomi Power Bank” మీరు మంచి ప‌వ‌ర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం త‌గ్గింపుతో.. జియోమీ ప‌వ‌ర్ బ్యాంక్

Xiaomi Power Bank” ఫోన్ అవ‌స‌రాలు ఎక్కువ‌గా ఉన్నవారు మంచి ప‌వ‌ర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com