సలార్‌ తొలి టిక్కెట్‌ కొన్న జక్కన్న

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం సలార్‌ పార్ట్‌ 1 కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఈ సినిమాని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్రవారం కర్ణాటకలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఇక తెలుగు రాష్టాల్ల్రో కూడా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి టిక్కెట్‌ను టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ విూడియాలో వెల్లడించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ లోని సంధ్య 70ఎంఎం థియేటర్‌లో భారీ ధరకు ఫస్ట్‌ టికెట్‌ ను బుక్‌ చేసుకున్నారు జక్కన్న. ఇక ఈ టికెట్‌ ధర చూసుకుంటే.. అక్షరాలా 10,116 రూపాయలు అని సమాచారం. ఇక రాజమౌళి ఫస్ట్‌ టికెట్‌ను ఇంత ధరకు కొనడంతో.. ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్‌ దక్కించుకున్నారు.

 

తొమ్మిదిమంది ఐఎఎస్‌ల బదిలీ

స్టేజ్‌పైనే కుప్ప‌కూలిన ప్ర‌ముఖ సింగ‌ర్

కేంద్ర‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత ఆగ్ర‌హం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *