ప్రభుత్వం అధికారుల బదిలీలను కొనసాగిస్తోంది. తాజాగా మరికొందరు ఐఎఎసలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు తమ శాఖలపై వరుస రివ్యూలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతోంది. అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. పలువురు అధికారులను బదిలీ చేస్తోంది. శుక్రవారం 2021 బ్యాచ్ కు చెందిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి శ్రీజ, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి గౌతమి, జనగామ అడిషన్ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్, మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ టోప్పో, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్, వనపర్తి అదనపు కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్, జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్‌గా పి కధీరవన్ ను ప్రభుత్వం నియామించింది.
ఇవి కూడా చదవండి
స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ సింగర్